ప్రకృతి వ్యవసాయం
ప్రస్తుత పరిస్థితుల్లో రసాయన వ్యవసాయం తో పండించిన ఆహార ని తీసుకోవడం వలన మనకు అంతుపట్టని రోగాలకు దారితీస్తున్నాయి. ఈ రసాయన లేదా సేంద్రియ వ్యవసాయానికి పెట్టుబడులు ఎక్కువైపోతున్నాయి. దీనితో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. రసాయన వ్యవసాయం కి సంబంధించి కొన్ని విష వాయువులు వెలుబడి మన వాతావరణం కూడా పాడవుతుంది. కంపోస్టు ఎరువులు ద్వారా పండించిన పంటల ద్వారా కూడా హానికర కారకాలు ఉత్పన్నమవుతున్నాయి. వీటన్నిటికీ ప్రత్యమంగా ప్రకృతి వ్యవసాయం ను కనుకొన్నారు. ఈ ప్రకృతి వ్యవసాయం వాళ్ళ ఖర్చు తక్కువా మరియు రాబడి ఎక్కువగా ఉంది. ప్రకృతి వ్యవసాయం లో పండించిన పంటలు తీసుకోవడం వాళ్ళ మన ఆరోగ్యం కూడా బాగుంటాది. ఆరోగ్యమే మహా భాగ్యం కదా!..ఇలా ప్రకృతి ద్వారా పండించిన వాటిని తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తీ పెరుగుతుంది. ఇందుకు ముఖ్యంగా మనకి కావలసినది భారతదేశీయ ఆవు ఉంటె చాలు.
గో మయ వసతి లక్ష్మీ, గో మూత్రే ధన్వంతరి అనేది సంస్కృతి సూక్తి ...
ప్రకృతి వ్యవసాయం లో ముఖ్యంగా నాలుగు విభాగాలుగా చెప్పుకోవచ్చు.
1) బీజామృతం
2) జీవామృతం
3) ఆచ్చేదనము (Mulching )
4) వాప్స (Wapsa)
I) బీజామృతం :-
బీజామృతం ను విత్తన శుద్ధి కి ఉపాయొగిస్తాము. బీజామృతం తో బీజాలను శుద్ధి చేయడం అన్నది అతి ముఖ్యమైన ప్రక్రియ. ఇందువలన గింజలు ఎక్కువ శాతం మొలకెత్తుతాయి. భూమి నుంచి విత్తనం నుంచి వచ్చే రోగాలను తెగుళ్లను మొక్క తట్టుకోగల సామర్థ్యం మొక్కలకి వస్తుంది. మొలకెత్తిన తర్వాత కొన్ని మొక్కలు చనిపోవడం లాంటివి జరగకుండా కాపాడుకోవచ్చు మరియు మొక్కలు కి వైరస్ ల నుండి తట్టుకునే సామర్థ్యం పెరిగి రోగ నిరోధక శక్తీ వస్తుంది.
బీజామృతం తయారీ విధానము( 100 కిలోల విత్తనాల శుద్ధి చేయడానికి)
1. 20 లీ. మంచి నీరు.
2. 5 లీ. దేశీ ఆవు పంచతం (మూత్రము).
3. 5 కేజీల దేశీ ఆవు మయము ( పేడ )
4. 100 - 150 గ్రాముల తినే సున్నము.
5. 50 గ్రాముల జీవాను మట్టి ( గట్టు మట్టి లేదా ఆడవి లో మట్టి )
పైన తెలిపిన వాటిన్నన్నిటిని ఒక మట్టి పాత్ర లేదా ప్లాస్టిక్ డ్రమ్ము లో తీసుకొని బాగా కలిసే వరకు కలిపి సవ్య దిశగా తిప్పుతూ ఒక కర్ర తో కలియబెట్టాలి. ఒక రాత్రంతా ఒక పలుచాటి గుడ్డతో కట్టి ఉంచాలి.(మూతపెట్టి) ఉంచాలి. ఆలా ఒక రాత్రి గడిచిన తరువాత మరుసటి రోజు విత్తన శుద్ధికి వాడుకోవచ్చు.
*** బీజామృతం ను 48 గంటల లోపు ఉపయోగించాలి.
II) జీవామృతం :-
ఒక ఎకరం కు సరిపడా జీవామృతం తయారీ విధానము :-
1. 200 లీ నీరు.
2. 7 - 10 లీ. దేశివాలీ ఆవు పంచతము (మూత్రము )
3.10 కిలోల దేశవాళీ ఆవు మయము.
4. 1 కేజీ బెల్లం లేదా 10 కిలోల చెరుకు చిన్నముక్కలు లేదా 4 లీ చెరుకు పాలు లేదా 1 కిలోతీపి పండ్ల గుజ్జు.
5. 1 కిలో శెనగ పిండి (ఉలవలు,శనగలు లేదా అలసందలు)
6. 50 గ్రాములు గట్టుమన్ను లేదా అడవిలోని మట్టి.
*** వేరుశనగ సోయాబీన్ వంటి గిజలు పొడి వాడకూడదు.
పైన తెలిపిన వాటిన్నన్నిటిని ఒక మట్టి పాత్ర లేదా ప్లాస్టిక్ డ్రమ్ము లో తీసుకొని బాగా కలిసే వరకు కలిపి సవ్య దిశగా తిప్పుతూ ఒక కర్ర తో కలియబెట్టాలి. ఆలా 2 - 4 రోజులు ఒక పలుచాటి గుడ్డతో కట్టి (మూతపెట్టి) ఉంచాలి. ఉదయము సాయంత్రం ప్రతి రోజు 1 నిమిషం పటు సవ్య దిశగా కలియతిప్పాలి. వర్షపు నీరు, సూర్య రశ్మి తగలకుండా జాగ్రత్త పడాలి.
ఈ జీవామృతం ను 7 నుంచి 14 రోజుల లోపు ఉపయోగించాలి. ( వేసవి కాలంలో ఐతే 7 రోజులలో, వర్షా కాలంలో ఐతే 14 రోజుల వరకు ఈ జీవామృతం ను ఉపయోగించుకోవచ్చు.
జీవామృతం ను 3 విధాలుగా ఉపయోగి0చవచ్చు.
1. నీతితో కలిపి పారించడము:-2. రెండు మొక్కల మధ్యలో నేల మీద డైరెక్టుగా పోయడం 3. పిచికారి
1. నీతితో కలిపి పారించడము:-
ఒక ఎకరానికి 200-400 లీ జీవామృతం ను నీతితో పాటుగా నెలకు ఒకటి లేదా రెండు సార్లు పారిచడం మంచిది. జీవామృతం ను తడి నెలలో ఉపయోగించడం మంచిది లేదంటే సాయంత్రం వేళలో జీవామృతంను కూడా వాడవచ్చు. వర్షా కాలపు వాతావరణం లో ఉపయోగించడం చాల ఉత్తమము. వర్షాకాలం లో ఎంత జీవామృతం ను ఉపయోగిస్తే అంట మంచిగా ఉంటుంది నెలలోని సారం.
2. రెండు మొక్కల మధ్యలో నేల మీద ఒకటి లేదా రేడు కప్పులు డైరెక్టుగా పోయడం (తడి నేల లో పోయాలి) :-
పండ్ల చెట్లకి ప్రతి నెలకి ఒకసారి మధ్యాహ్నం చెట్టు నీడ పరిదిలో భూమి మీద వేయాలి. మొదటి 6 నెలలు ప్రతి ఒక్క మొక్కకి 100 ML నెలకి , తరువాతి 6 నెలలు నెలకు200 ML . తరువాతి 12 నెలలు నెలకు 500 ML , రెండు సంవత్సరాల తర్వాత 1 లీ జీవామృతం ఒక మొక్కకి. , 3 సంవస్త్సరం నుంచి
మొక్కకి 2 లీ. నెలకు చొప్పున ఉపయోగించాలి.
3. పిచికారి :-
జీవామృతం ను బట్టతో 2 సార్లు వడపోసి ఎకరానికి 2 - 4 లీ . పిచికారిగా ఉపయోగించవలెను. ఇలా పిచికారీ చేయడం వళ్ళ మొక్కలు బాగా బలంగా తయారై ఆకుల వైశాల్యం పెరిగి ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంచే శక్తి వస్తుంది. మొక్కలకు రోగ నిరోధక శక్తి వస్తుంది. జీవామృతం మొక్కలకు అవసరమైన సూక్ష్మజీవుల ను దగ్గర చేసి. మొక్కలకి హాని కలిగించే సూక్ష్మజీవుల ను నశింపచేస్తుంది. జీవామృతం ఒక మంచి ఫంగస్ నివారినిగాను, వైరస్ నివారింగాను ఉపయోగపడుతుంది.
ఖరీఫ్ రబీ పంటలలో ఋతు సంబంధ పంటలలో:-
1. విత్తులు లేదా మొక్కలు నాటిన వెంటనే 100 లి. నీటి లో 5 లి. జీవామృతం ను కలిపి పిచికారీ చేయాలి.
2 21 రోజుల తరువాత 150 లి. నీటిలో 10 లీ. జీవామృతం ను కలిపి పిచికారీ చేయాలి. .
3. 21 రోజులు తరువాత 200 లీ. నీటిలో 20 లీ. జీవామృతం ను కలిపి పిచికారీ చేయాలి.
4. గిజాలు పాలుపోసుకునే దశలో లేదా పూలు మొక్కలు ఐతే మొగ్గ దశలో 200 లి,. నీటిలో 5 -6 లి. పుల్లటి
(3 రోజులు పులిసిన ) మజ్జిగ ను పిచికారీ చెయ్యాలి.
పండ్ల తోటల్లో :-
1. పండ్లు కోతలు ముగిసిన వెంటనే 200 లీ. నీటిలో 20 లి. జీవామృతం ను కలిపి పిచికారీ చేయాలి. .
2. కొత్త చిగుర్లు వచ్చేప్పుడు ఆకులు ఎర్ర రంగునుంచు వచ్చేప్పుడు 200 లీ. నీటిలో 20 లి. జీవామృతం ను కలిపి
పిచికారీ చేయాలి. .
3. పూత వచ్చిన సమయంలో 200 లి. నీటిలో 200 లి. దసపరిని కాషాయం లేదా 20 లి. నీమాస్రం ని
ఉపయోగించాలి. మల్లీ 21 రోజులు తర్వాత మల్లి పిచికారీ చేయాలి.
3. పండ్లు చిన్నగ ఉన్నపుడు 200 లీ. నీటిలో 20 లీ. జీవామృతం ను కలిపి పిచికారీ చేయాలి.
4. పండ్లు మీడియంగా కయ దశలో ఉన్నపుడు 200 లి. నీటిలో సప్త ధాన్యంకురా కషయం ను పిచికారీ చెయ్యాలి.
కొత్త తొట్లలో :-
1. నాటిన నెల రోజులకి , ఎకరానికి 100 లీ. నీటిలో 5 లి. జీవామృతం ను కలిపి పిచికారీ చేయాలి. .
2 21 రోజుల తరువాత 150 లి. నీటిలో 10 లీ. జీవామృతం ను కలిపి పిచికారీ చేయాలి. .
3. 21 రోజులు తరువాత 200 లీ. నీటిలో 20 లీ. జీవామృతం ను కలిపి పిచికారీ చేయాలి.
4. నెల రోజుల తర్వాత 200 లి. నీటిలో 5 - 6 లి. పుల్లటి మజ్జిగ
5. నెల రోజుల తర్వావత 200 లీ. నీటిలో 20 లీ. జీవామృతం ను కలిపి పిచికారీ చేయాలి.
6. నెల రోజుల తర్వావత 200 లీ. నీటిలో 20 లీ. జీవామృతం ను కలిపి పిచికారీ చేయాలి.
గణ జీవామృతం :-
ఒక ఎకరం కు సరిపడా గణ జీవామృతం తయారీ విధానము :-
1. 100 కేజీల దేశీ ఆవు మయము ( 21 రోజులు మగ్గినది ప్రతిరూజు నీళ్లు చల్లుతూ నీడలో ఉంచింది )
2. 1 కిలో బెల్లం
3. 1 కిలో పప్పుల పిండి.(ఉలవలు,శనగలు లేదా అలసందలు)
4. 10 లీ . దేశీ ఆవు పంచతము .
5. గుప్పెడు గట్టు మట్టి .
పై వాటినన్నిటిని బాగా కలిపి నీడలో 48 గంటలు ఉంచి సూర్య రశ్మి, వర్షపు నీరు పడకుండా చూసుకోవాలి. కప్పి ఉంచాలి. 48 గంటలు తర్వాత మంచి మండుటెండలో చిన్న చిన్న ఉండలు గ ఉంచి తిప్పుతూ చూసుకొని బాగా ఎండే లాగా చూసుకోవాలి. బాగా ఎండిన తర్వాత వాటిని మల్లి బాగా పొడిగా చేసి భద్ర పరుచుకొని ఒక సంవత్సరం వరకు వాడుకోవచ్చు.
*** జీవామృతం తో కలిపిన పేడను చిన్న చిన్న ఉంటలు గా చేసి నీడలో ఒక 7 రోజులు ఆర్బీట్టుకొని బాగా ఎండిన ముద్దలను నిల్వచేసుకోవచ్చు. అవసరం ఉన్నపుడు మల్లి వాడుకోవచ్చు.
III ) అచ్చేదనం :-
అచ్చేదనం అనగా భూమి పై పొరను కప్పి ఉంచడము. ఇలా భూమి పై పొరను కప్పి ఉంచడం వలన భూమిలోని తేమ ఆవిరి కాకుండా ఉంటుంది. కలుపు మొక్కలు మొలకెత్తకుండా చేస్తుంది మరియు గాలిద్వారా వచ్చే కలుపు గింజలు అఛేదనము మీద నిలిచిపోతాయి కాబట్టి అవి కూడా మొలకెత్తవు.
IV ) వత్సా :-
మట్టి కణాల మధ్య మంచి కాలిప్రదేశము ఏర్పడేలా చేస్తే నీటి ఆవిరి ఆయా కాళీ ప్రదేశాల నుంచి మొక్కల వేర్లకు బాగా అందుతుంది. భూమిలోని సూక్ష్మజీవి రాశికి గాలి బాగా తగలడం వాళ్ళ నీటి ఆవిరి మొక్కల వేర్లకు అందుతుంది.
పైన తెలిపిన విధంగా చేసుకుంటా ఉంటె మొక్కలు బాగా పెరిగి మంచి దిగుబడులు సాధించవచ్చు.
అయినప్పటికీ కొన్ని కారణాల చేత మొక్కలకి వ్యాధులు పురుగులు తెగుళ్లు లాంటివి ఆశించినపుడు పాటించవలసిన కొన్ని ప్రాకృతికా మొక్కల సంరక్షణ విధానాలు గురించి తెలుసుకోవలసిన అవసరం ఉంది.
మొక్కల సంరక్షణకు ఉపయోగపడే కాషాయాలు :-
పురుగుల మందులు (Insectiside)
1) నీమాస్రం :-
1) 200 లీ. నీరు ఒక ప్లాస్టిక్ బ్యాలర్ లో తీసుకోవాలి.
2) 10 లీ. దేశవాళీ ఆవు పంచతము
3) 10 కేజీ ల వేపా ఆకులు రెమ్మలు ముక్కలు ముక్కలుగా చేసి వేయాలి
4) 2 కేజీల దేశవాళీ ఆవు పేడ
వీటి అన్నిటిని బాగా కలిసేంత వరకు ఒక కర్ర తీసుకొని సవ్య దిశగా కలియతిప్ప్పాలి తర్వాత సూర్య రశ్మి తగలకుండా నీడలో వర్షపు నీరు కలవకుండా జాగ్రత్త పడాలి. ఉదయము, సాయంత్రం ఒక నిమిషం పాటు సవ్య దిశగా ప్రతి రోజు కలియ తిప్పాలి. ఇలా 48 గంటలు గడిచిన తర్వాత ఈ నిమస్త్రం ను మొక్కలకి పిచకారిగా ఉపయోగించడం వలన పంటలలోని చిన్న చిన్న పురుగులు సూక్ష్మ క్రిములు వైరస్ బాక్టీరియా లాంటివి అంతమవుతాయి. పదిరోజులుకి రెండు సార్లు పిచికారీ చేస్తే మంచి ఫలితాలు వస్తున్నాయి ఆరు నెలల వరకు ఉపయోగించవచ్చు. ఇందులో నీళ్లు కలపకుండా వాడాలి. దీనివల్ల రసం పీల్చు పురుగులు కంట్రోల్ చేయవచ్చు
కానీ పెద్ద పెద్ద గొంగళి పురుగులకు ఇది నియంత్రించలేందు ఇందుకు బ్రహ్మాఅస్త్రము ని ఉపయోగించవలెను.
2) బ్రహ్మ అస్త్రం:-
బ్రహ్మాఅస్త్రము తయారీకి కావలసిన పదార్దాలు
1) 20 లీ. దేశవాళీ ఆవు పంచతము
2) 2 కేజీ ల వేపా ఆకులు రెమ్మలు ముక్కలు చట్నీ
3) 2 కేజీల కానుగ ఆకుల చట్నీ.
4) 2 కేజీల సీతాఫలం ఆకుల చట్నీ. లేదా పల్లేరు ఆకులూ
5) 2 కేజీల ఉమ్మెత్త ఆకుల చట్నీలేదా మామిడి ఆకుల చట్నీ. .
6) 2 కేజీల ఆముదం ఆకుల చట్నీ
వీటన్నిటిని ఒక మట్టి పాత్రలో తీసుకొని సవ్య దిశలో బాగా కలిపి, ఈ మిశ్రమాన్ని మంటమీద పెట్టి నాలుగు పొంగులు వచ్చేవరకు పొంగించాలి. దానిని తర్వాత పొయ్యి మీద నుంచి దించి నీడలో ఉంచాలి, ఉదయము సాయంత్రము ఒక నిమిషం పాటు సవ్య దిశగా కలియపెట్టాలి . ఆలా 48 గంటలు గడిచిన తర్వాత ఒక నూలు వస్త్రంతో వడపోసుకొని 6 నెలల వరకు ఈ మిశ్రమాన్ని నిల్వ చేసుకోవచ్చు.
ఎకరానికి 200 లి. నీటిలో 5-6 లి. బ్రహ్మాస్త్రం ని ఉపయోగించవచ్చు. ఈ బ్రహ్మాస్త్రం తో రసం పీల్చుపురుగులు, గొంగళి పురుగులు నియంత్రించవచ్చు.
కానీ కాయ లోపల ఉన్న పురుగులు మరియు కాండం లోపల ఉన్న పురుగులకు అగ్ని అస్త్రం ను తయారు చేసుకోవాలి.
3) అగ్నిఅస్త్రం:-
తయారీకి కావలసిన పదార్దాలు
1) 20 లీ. దేశవాళీ ఆవు పంచతము
2) 2 కేజీ ల వేపా ఆకులు రెమ్మలు ముక్కలు చట్నీ
3) 1/2 కేజీ పొగాకు పొడి
4) 1/2 కేజీ పాచి మిర్చి చట్నీ.
5) 1/4 కేజీ వెల్లులి చట్నీ.
వీటన్నిటిని ఒక మట్టి పాత్రలో తీసుకొని సవ్య దిశలో బాగా కలిపి, ఈ మిశ్రమాన్ని మంటమీద పెట్టి నాలుగు పొంగులు వచ్చేవరకు పొంగించాలి. దానిని తర్వాత పొయ్యి మీద నుంచి దించి నీడలో ఉంచాలి, ఉదయము సాయంత్రము ఒక నిమిషం పాటు సవ్య దిశగా కలియపెట్టాలి . ఆలా 48 గంటలు గడిచిన తర్వాత ఒక నూలు వస్త్రంతో వడపోసుకొని 3 నెలల వరకు ఈ మిశ్రమాన్ని నిల్వ చేసుకోవచ్చు.
ఎకరానికి 200 లి. నీటిలో 5-6 లి. అగ్ని అస్త్రం ని ఉపయోగించవచ్చు.
ఒక ఎకరానికి ఈ అగ్ని అస్త్రం ఉపయోగించి , కాయతొలుచు పురుగులు మరియు కాండం తొలుచు పుగులు లాంటివి నియంత్రించవచ్చు.
ఒక ఎకరానికి తామరపురుగు నివారణ కొరకు 200 లీ నీటిలో 3 లీ. బ్రహ్మాస్త్రం మరియు 3 లీ. అగ్నిఅస్త్రం లను కలిపి పిచికారీ చేసుకోవచ్చు .
దశపారణి కాషాయం
నీమాస్త్రం , అగ్ని అస్త్రం మరియు బ్రహ్మాస్త్రం లను అన్నింటి ని కలిపి చేసేదే దశపారని కషాయము. దీనితో మొక్కలకి వచ్చే అన్ని చీడ పీడలు నివారించ బడతాయి.
తయారీకి కావలసిన పదార్దాలు
1) 200 లీ. నీరు ఒక ప్లాస్టిక్ బ్యాలర్ లో తీసుకోవాలి.
2) 20 లీ. దేశవాళీ ఆవు పంచతము
3) 200 గ్రాములు పసుపు పొడి.
4) 2 కేజీల దేశవాళీ ఆవు పేడ
5) 500 గ్రాముల అల్లం చట్నీ
6) 10 గ్రాముల ఇంగువ
ఈ మిశ్రమాన్ని బాగా కలియ తిప్పి ఒక రాత్రంతా ఒక గోని సంచితో కప్పి ఉంచాలి. మరుసటి రోజు
ఉదయాన్నే ఈ మిశ్రమం లో
7) 1 కేజీ పొగ ఆకు పొడి
8) 1 కేజీ పచ్చి మిర్చి చట్నీ
9) 1/2 కేజీ వెల్లుల్లి చట్నీ.
ఈ మిశ్రమాన్ని బాగా కలియ తిప్పి ఒక రాత్రంతా ఒక గోని సంచితో కప్పి ఉంచాలి. మరుసటి రోజు
ఉదయాన్నే ఈ మిశ్రమం లో
10) 2 కేజీ ల వేపా ఆకులు రెమ్మలు ముక్కలు ముక్కలుగా చేసి వేయాలి
11) 2 కేజీల కానుగ ఆకులు ముక్కలు
12) 2 కేజీల సీతాఫలం ఆకుల ముక్కలు .
13) 2 కేజీల ఉమ్మెత్త ఆకుల ముక్కలు
14) 2 కేజీల ఆముదం ఆకుల చిన్న చిన్న ముక్కలు
15) 2 కేజీల మారేడు ఆకుల ముక్కలు
16) కృష్ణతులసి ఆకుల ముక్కలు దంచినవి
17) 2 కేజీల బంతి చెట్టు పంచాంగాలు (పూలు, ఆకులు , కండము, వేర్లు మరియు రెమ్మలు) చిన్న ముక్కలు
18) 2 కేజీల జిల్లేడు ఆకులు ముక్కలు
19) 2 కేజీల గన్నేరు ఆకులా ముక్కలు
20) 2 కేజీల మామిడి ఆకుల ముక్కలు .
21) 2 కేజీల బొప్పాయి ఆకుల చిన్న చిన్న ముక్కలు
22) 2 కేజీల మందారం ఆకులు దంచినవి.
23) 2 కేజీల మునగ ఆకుల ముక్కలు
24) 2 కేజీల పల్లేరు ఆకుల ముక్కలు
25) 2 కేజీల తుమ్మ ఆకుల రెమ్మలు ముక్కలు
26) 2 కేజీల పసుపు ఆకులు చిన్న చిన్న ముక్కలు
27) 2 కేజీల అల్లం ఆకుల ముక్కలు
28) 2 కేజీల కాఫీ ఆకుల ముక్కలు
29) 2 కేజీల కాగితం పులా యాలకుల ముక్కలు
30) 2 కేజీల బాలపాకులా చిన్న చిన్న ముక్కలు
31) 2 కేజీల తంగేడు ఆకుల ముక్కలు
32) 2 కేజీల దానిమ్మ ఆకుల ముక్కలు
33) 2 కేజీల ఉత్తరేణి మొక్కలు / ఆకుల ముక్కలు
వీటన్నిటి లో ఏవైనా పది ఆకులను తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి పైన తెలిపిన మిశ్రమంలో కలిపి వీటి అన్నిటిని బాగా కలిసేంత వరకు ఒక కర్ర తీసుకొని సవ్య దిశగా కలియతిప్ప్పాలి తర్వాత సూర్య రశ్మి తగలకుండా నీడలో వర్షపు నీరు కలవకుండా జాగ్రత్త పడాలి. ఉదయము, సాయంత్రం ఒక నిమిషం పాటు సవ్య దిశగా ప్రతి రోజు కలియ తిప్పాలి. ఇలా 41 రోజులు చేసినచో దశపర్ణి కాషాయం రెడీ అవుతుంది.
తర్వాత ఒక నూలు వస్త్రంతో వడపోసుకొని 3 నెలల వరకు ఈ మిశ్రమాన్ని నిల్వ చేసుకోవచ్చు. ఎకరానికి 200 లి. నీటిలో 5-6 లి. దశపరిణీ కాషాయం ని ఉపయోగించవచ్చు. ఈ కషాయంతో అన్ని రకాల చీడలు, తెగుళ్లు, సిలింద్రాలు అన్ని నివారించబడతాయి.
సప్తధాన్యంకుర కషాయము
1) 100 గ్రాముల నువ్వులను ఒక పాత్రలో నన పెట్టాలి
24 గంటలు తర్వాత
2)100 గ్రాములు పెసళ్ళు
3) 100 గ్రాములు మినుములు
4) 100 గ్రాములు ఉలవలు
5) 100 గ్రాములు అలసందలు
6) 100 గ్రాములు కందులు
7) 100 గ్రాములు నాటు శనగలు (గుగ్గులు)
వీటి అన్నింటిని బాగా కలిపి ఒక పాత్రలో నీళ్లు పోసి బాగా నానపెట్టాలి. మరుసటి రోజు ఈ 7 రకాల గింజలను ఒక తడి గుద్దలో తీసుకొని మూటకట్టి ఉంచాలి. వాటినుంచి ఒక సెంటీమీటరు మొలకలు వచ్చిన తరువాత వాటిని రోకలి తో బాగా రుబ్బుకొని ఒక 200 లీటర్లు తీసుకొని దానిలో 10 లీటర్ల దేశవాళీ ఆవు మూత్రమును కలపాలి. గింజలు నానా పెట్టిన నీళ్లు కూడా ఇందులో కలిపి ఒక కర్ర తో సవ్య దిశలో కలియపెట్టాలి. ఆలా బాగా కలియపెట్టిన ద్రావణాన్ని ఒక రెండుగంటలు నీడలో ఉంచాలి ఆలా నీడలో ఉంచిన ద్రావణం ఆయనైజషన్ జరిగి రసాయనికంగా స్థిర పడుతుంది. దీనితో సప్త ధాన్యంకుర కాషాయం తయారవుతుంది.
ఈ ద్రావణం ను ఒక బట్టతో వడపోచుకొని పిచికారిగా ఉపయొకించవచ్చు. దీనిని నీటిలో కలిపి పిచికారీ చేయరాదు. సప్తధాన్యంకురా కషాయంను నేరుగా మొక్కల మీద పువ్వులు మొగ్గ దశలో కానీ లేదా గింజలు మొదటి దయ అంటే గింజలు పాలు పోసుకునే దశలో పిచకారిగా ఉపయోగించవలెను. ఇలా చేసినచో పండ్లు , కాయలు నాణ్యత పెరిగి అధిక దిగుబడినిస్తాయి .
ఈ ద్రావణం ఒక ఎకరానికి సరిపోతుంది. దినిని 48 గంటల లోపే ఉపయోగించాలి.
వేప లేపనము:-
దినిని కాండం మీద పూయడం వాళ్ళ చెదలు లాంటి పురుగుల నుండి రక్షించుకోవచ్చు . కాండం మీద ఉన్న బెరడు చిట్లిపోవడం లాంటి వాటిని నివారించవచ్చు. ఈ రంద్రాల ద్వారా సిలీన్ద్రాలు మొక్కలోకి ప్రవేశించి హాని చేసే క్రిములను హరిస్తుంది. కాండము బాగా నున్నగా వస్తుంది.
50 లీటర్ల నీటిలో 20 లీటర్ల దేశవాళీ ఆవు పంచతము , 20 కేజీల ఆవు మయము మరియు 5-6 కేజీల వేప రెమ్మల ఆకుల ముక్కలు చట్నీ కలపాలి . ఈ మిశ్రమాన్ని బాగా కలిసేంత వరకు ఒక కర్ర తీసుకొని సవ్య దిశగా కలియతిప్ప్పాలి తర్వాత సూర్య రశ్మి తగలకుండా నీడలో వర్షపు నీరు కలవకుండా జాగ్రత్త పడాలి. ఉదయము, సాయంత్రం ఒక నిమిషం పాటు సవ్య దిశగా ప్రతి రోజు కలియ తిప్పాలి. ఇలా 48 గంటలు గడిచిన తర్వాత ఈ వేప లేపనం సిద్ధంగా ఉంటుంది. తయారు చేసిన 7 రోజుల లోపు దీనిని కాండం పైన సంవత్సరంలో 4 సార్లు పట్టించాలి.
1) కృత్తికా నక్షత్రంలో ( మే మొదటి వారంలో )
2) హస్తా నక్షత్రంలో ( సెప్టెంబర్ చివరి వారంలో)
3) ఉత్తరాయణం ప్రారంభంలో ( డిసెంబర్ 21 నుంచి జనవరి 14 తేదీ లోపు)
4) హోలీ కి ఉగాదికి మధ్యలో
ఇలా ఉపయోగిస్తే మంచి ఫలితాలు వస్తున్నాయి....
మిరప మరియు కాయకూరలో చిన్న పండ్ల తోటలు విషయంలో సస్యరక్షణా
పిచికారీ సమయక్రమము
1. విత్తులు లేదా మొక్కలు నాటిన నెల తర్వాత 100 లి. నీటి లో 5 లి. జీవామృతం ను కలిపి పిచికారీ చేయాలి.
2 మొదటి పిచికారీ చేసిన పదిరోజుల తర్వాత 100 లి. నీటిలో 3 లీ. దశపారని కాషాయం లేదా 100 లి.
నీమాస్రం పిచికారీ చేయాలి. .
3. రెండవ పిచికారీ చేసిన 10 రోజుల తర్వాత 100 లీ. నీటిలో 3 లీ. పుల్లటి మజ్జిగ ను కలిపి పిచికారీ చేయాలి.
4. మూడవ పిచికారీ చేసిన 10 రోజుల తర్వాత 150 లి. నీటి లో 10 లి. జీవామృతం ను కలిపి పిచికారీ చేయాలి.
5. నాల్గవ పిచికారీ చేసిన 10 రోజుల తర్వాత 150 లి. నీటి లో 4-5 లి దశపారని కాషాయం లేదా 150 నీటిలో
5 లి. బ్రహ్మాస్త్రం ను పిచికారీ చెయ్యాలి.
6. 5వ పిచికారీ చేసిన 10 రోజుల తర్వాత 150 లీ. నీటిలో 5-6 లీ. పుల్లటి మజ్జిగ ను కలిపి పిచికారీ చేయాలి.
7. 6వ పిచికారీ చేసిన 10 రోజుల తర్వాత 200 లీ . నీటిలో 20 లీటర్ల జీవామృతం ను పిచికారీ చేయేయ్యాలి.
8. 7 వ పిచికారీ చేసిన పది రోజుల తర్వాత 200 లి. నీటిలో 6-8 లీటర్లు దశపారని కాషాయం లేదా అగ్ని అస్త్రం ను
కలిపి పిచికారీ చెయ్యాలి
9. 8 వ పిచికారీ చేసిన పది రోజుల తర్వాత 200 లి నీటిలో 5 లీటర్ల పుల్లటి మజ్జిగ చెయ్యాలి.
10 గిజాలు పాలుపోసుకునే దశలో 200 లి,. సప్త దాన్యకురా కాషాయం ను పిచికారీ చేసుకోవాలి.
రాజీవ్ దీక్సిట్ కాషాయం
తయారీకి కావలసిన పదార్దాలు
1) 200 లీ. నీరు ఒక ప్లాస్టిక్ బ్యాలర్ లో తీసుకోవాలి.
2) 20 లీ. దేశవాళీ ఆవు ఎద్దు పంచతము
3) 200 గ్రాములు పసుపు పొడి.
4) 2 కేజీల దేశవాళీ ఆవు పేడ
5) 500 గ్రాముల అల్లం చట్నీ
7) 1/2 కేజీ పొగ ఆకు పొడి
8) 1/2 కేజీ పచ్చి మిర్చి చట్నీ
9) 1/2 కేజీ వెల్లుల్లి చట్నీ.
10) 3 కేజీ ల వేపా ఆకులు రెమ్మలు చట్నీ
11) 2 కేజీల కానుగ ఆకులు చట్నీ
12) 3 కేజీల సీతాఫలం ఆకుల చట్నీ
13) 3 కేజీల ఉమ్మెత్త ఆకుల చట్నీ
14) 2 కేజీల ఆముదం ఆకుల చట్నీ
15) 2 కేజీల మారేడు ఆకుల చట్నీ
16) కృష్ణతులసి ఆకుల ముక్కలు చట్నీ
17) 2 కేజీల బంతి చెట్టు పంచాంగాలు (పూలు, ఆకులు , కండము, వేర్లు మరియు రెమ్మలు) చిన్న ముక్కలు
18) 2 కేజీల జిల్లేడు ఆకులు చట్నీ
19) 2 కేజీల గన్నేరు ఆకులా చట్నీ
20) 2 కేజీల మామిడి ఆకుల చట్నీ .
21) 2 కేజీల బొప్పాయి ఆకుల చట్నీ
22) 2 కేజీల మందారం ఆకులు దంచినవి.
23) 2 కేజీల మునగ ఆకుల చట్నీ
24) 2 కేజీల పల్లేరు ఆకుల చట్నీ
25) 2 కేజీల తుమ్మ ఆకుల రెమ్మలు చట్నీ
26) 2 కేజీల పసుపు ఆకులు చట్నీ
27) 2 కేజీల అల్లం ఆకుల చట్నీ
28) 2 కేజీల కాఫీ ఆకుల చట్నీ
29) 2 కేజీల కాగితం పులా యాలకుల చట్నీ
30) 2 కేజీల బాలపాకులా చట్నీ
31) 2 కేజీల తంగేడు చట్నీ
32) 2 కేజీల దానిమ్మ చట్నీ
ఆవులు తినని ఆకులు ఏమైనా 10 రకాలు చట్నీ వచేసి బాగా కలిసేంతవరకు , ఒక కర్ర తీసుకొని సవ్య దిశగా కలియతిప్ప్పాలి తర్వాత సూర్య రశ్మి తగలకుండా నీడలో వర్షపు నీరు కలవకుండా జాగ్రత్త పడాలి. ఉదయము, సాయంత్రం ఒక నిమిషం పాటు సవ్య దిశగా ప్రతి రోజు కలియ తిప్పాలి. ఇలా 15 రోజులు చేసినచో కాషాయం రెడీ అవుతుంది. తర్వాత ఒక నూలు వస్త్రంతో వడపోసుకొని 3 నెలల వరకు ఈ మిశ్రమాన్ని నిల్వ చేసుకోవచ్చు. ఎకరానికి 200 లి. నీటిలో 5-6 లి. దశపరిణీ కాషాయం ని ఉపయోగించవచ్చు. ఈ కషాయంతో అన్ని రకాల చీడలు, తెగుళ్లు, సిలింద్రాలు అన్ని నివారించబడతాయి.
కోడిగ్రుడ్డు - నిమ్మ అమృతం ( Egg అమైనో ఆసిడ్ ):-
మొక్కల లో రోగ నిదొరక శక్తీ ని పెంపొందించే కషాయము.
తయారీకి కావలసిన పదార్దాలు
1) నిమ్మకాయలు
2) కోడిగ్రుడ్డులు
3) బెల్లము
ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని. అందులో బెల్లము,కోడిగుడ్లు మరియు అవి మునిగేఇంతవరకు నిమ్మరసం కలిపి ఉదయము సాయంత్రం ఆలా ఒక సరి మూత తీసి ఆలా సవ్య దిశలో కలియపెట్టి మూతపెట్టి నీడలో ఉంచుకోవాలి ఆలా ఒక 20 రోజులు చేసిన తర్వాత ఎగ్గూ అమైనో ఆసిడ్ తయారవుతుంది. ఇలా తయారైన నిమ్మ గుడ్డు అమృతం ను ఎకరానికి 100 లీ. నీటిలో , 200 ML కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఈ అమృతం ను 6 మాసాల వరకు ఉపయోగించవచ్చు.
ఈ కోడిగుడ్డు నిమ్మ కాషాయం ను ఉపయోగించడం వలన మొక్కకి అన్ని ఫోషక విలువలు అంది మంచిగా ఎదుగుతుంది. మొక్కలలో రోగ నీదోదక శక్తీ పెరుగుతుంది. ఈ అమైనో ఆసిడ్ వాళ్ళ కొన్ని రకాల క్రిమికీటకాలు కూడా హరించపడతాయి.
మీనామృతం :-
మొక్కల లో రోగ నిదొరక శక్తీ ని పెంపొందించే కషాయము.
తయారీకి కావలసిన పదార్దాలు
1) నిమ్మకాయలు
2) చేపలు వాటి వ్యర్థ పదార్థాలు
3) బెల్లము
ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని. అందులో బెల్లము,చేపలు వ్యర్థపదార్థాలు మరియు అవి మునిగేతవరకు నీరు కలిపి ఉదయము సాయంత్రం ఆలా ఒక సరి మూత తీసి ఆలా సవ్య దిశలో కలియపెట్టి మూతపెట్టి నీడలో ఉంచుకోవాలి ఆలా ఒక 27 రోజులు చేసిన తర్వాత ఫిష్ అమైనో ఆసిడ్ (మీనామృతం) తయారవుతుంది. ఈ అమృతం ను 6 మాసాల వరకు ఉపయోగించవచ్చు.
ఈ అమృతం ను అన్ని పంటలలో దీనిని పిచికారిగా వాడవచ్చు. ఎకరానికి 100-200 లీ. నీటిలో , 200 - 400 ML కలిపి పిచికారీ చేసుకోవచ్చు.
ఐటీ సైంటిస్ట్ శ్యాం సుందర్ మీనామృతం:-
తయారీకి కావలసిన పదార్దాలు
1) 5 లీ ఆవు పంచతం
2) 1 కేజీ చేపలు వాటి వ్యర్థ పదార్థాలు చిన్న చిన్న ముక్కలు
3) 1 కేజీ బెల్లము
అన్ని కలిపి పదిరోజులు మగ్గబెట్టాలి తర్వాత వడపోసుకొని 10 లి. మీనామృతం కు 1 లి. కల్లు , కొద్దిగా తేనే, నేయ్యి కలిపి వాడుకోవచ్చు. 100 లీ. నీటికి 2-5 లి.. ఈ మిశ్రమం కలిపి వాడుకోవచ్చు.
ఆవు పేడ, మూత్రం లకు మించిన అంటి బాక్ట్రియా లేదు.
కలబంద
పసుపు
ఇంగువ
ఒక కుండలో బాగా మరిగించి చల్ల పరుచుకొని ఎకరానికి 500 ml కలిపి పిచికారిగా చేసుకుంటే పెద్ద పెద్ద పురుగుల ను పారత్రోలవచ్చు ఆలా వాటి నుంచి నివారణ జరుగుతుంది.
జీవన ఆదాయం గ వ్యవసాయం చేయకూడదు
జీవన విధానం గ భావిస్తే బాగుంటుంది.
దేశి రైస్ రకాలు వాటి ప్రాముఖ్యత.
1) రక్తశాలి >ఎరుపు> సన్నరకం> పంటకాలం>110 నుంచి 115 రోజులు.
2) కుల్లాఖర్ > ఎరుపు> లావురకము> పంటకాలం>110 నుండి115 రోజులు.
3) పుంగార్ >ఎరుపు >లావురకం> పంటకాలం>95 నుండి115 రోజులు.
4) కర్పూకౌవుని >నలుపు> పొడవురకము> పంటకాలం>110 నుండి120 రోజులు.
5) మైసూర్ మల్లిగ >తెలుపు>సన్నరకము> పంటకాలం>110 నుంచి 120 రోజులు.
6) చింతలూరు సన్నాలు > తెలుపు> సన్నరకం > పంటకాలం>110 నుండి 120 రోజులు.
7) కుజీపటాలీయా >తెలుపు>సన్నరకము> పంటకాలం>120 నుండి 125రోజులు.
8) ఇంద్రాణి >తెలుపు>సన్నరకం>పంటకాలం> 120 నుండి 125 రోజులు.
9) నవార >ఎరుపు>మధ్యరకం>పంటకాలం> 125 నుండి 130 రోజులు.
10) రామ్ జీరా > తెలుపు> పొట్టిరకము> పంటకాలం 120 నుండి130 రోజులు.
11) ఘని >తెలుపు>పొట్టిరకం>పంటకాలం> 125 నుండి 130 రోజులు.
12) సిద్ధ సన్నాలు >తెలుపు>సన్నరకం> పంటకాలం>130 నుండి 135రోజులు.
13) గురుమట్టియా > తెలుపు> లావురకం> పంటకాలం130 నుండి135రోజులు.
14) రత్నచోడి > తెలుపు>సన్నరకం> పంటకాలం>130 నుండి135 రోజులు.
15) మడ మురంగి >ఎరుపు>లావురకం> పంటకాలం>130 నుండి135 రోజులు.
16) కెంపు సన్నాలు > ఎరుపు>సన్నరకం> పంటకాలం>130 నుండి135రోజులు.
17) దూదేశ్వర్ >తెలుపు>సన్నరకం> పంటకాలం>130 నుండి135 రోజులు.
18) నారాయణ కామిని >తెలుపు>సన్నరకం> పంటకాలం>130 నుండి140 రోజులు.
19) బర్మా బ్లాక్ లాంగ్ >నలుపు>పొడవు రకము>పంటకాలం>130 నుండి 135 రోజులు.
20) బర్మా బ్లాక్ షార్ట్ >నలుపు>పొట్టిరకము> పంటకాలం>130 నుండి135 రోజులు.
21) బాసుమతి > తెలుపు>పొడవు> పంటకాలం>130 నుండి135 రోజులు.
22) గంధసాలె >తెలుపు>పొట్టిరకము> పంటకాలం>135 నుండి 140 రోజులు.
23) వెదురు సన్నాలు >తెలుపు>లావురకం> పంటకాలం>135 నుండి145 రోజులు.
24) కామిని భోగ్ >తెలుపు> పొట్టిరకము> పంటకాలం>140 నుండి145 రోజులు.
25) ఇల్లపుసాంబ > తెలుపు> సన్నరకం> వంటకాలం>140 నుండి145 రోజులు.
26) కాలాబట్టి >నలుపు>లావురకము> పంటకాలం>140 నుండి150 రోజులు.
27) కాలాబట్ >నలుపు>లావురకం> పంటకాలం>140 నుండి150 రోజులు.
28) బాస్ బోగ్ >తెలుపు> పొట్టిరకం> పంటకాలం>140 నుండి150 రోజులు.
29) రధునిపాగల్ > తెలుపు>పొట్టిరకము> పంటకాలం>140 నుండి145 రోజులు.
30) బహురూపి >తెలుపు>లావురకం> వంటకాలం>140 నుండి150 రోజులు.
దేశీవరి విత్తనాలు పంట కాలము,మాకు తెలిసిన సమాచారం ఇవ్వబడినది.ఇందులో తప్పులు ఏమైనా ఉంటే సరిదిద్దుకోండి. "సర్వేజనా సుఖినోభవంతు"
1👉 రక్త శాలి:ఈ రైసు ఎరుపు రంగులో ఉంటుంది.అత్యంత పోషక విలువలు,ఔషధ మూలికా విలువలు కలిగినది. ఆయుర్వేదలో వాతము పిత్తము కఫము నివారించును అని మరియు మూడు వేల సంవత్సరాల కన్నా ఎక్కువ కాలము నాటిది అని చెప్పబదినది. ఈ రైస్ను ఎర్రసాలి,చెన్నేల్లు,రక్తాసలి అని కూడా అంటారు. ఎరుపు రకాల్లోమోస్ట్ వ్యాల్యూబుల్ రైస్.
2👉 కర్పూకవుని:ఈ రైసు నలుపు రంగులో ఉంటుంది.బరువు తగ్గుటకు అనువైన ఆహారముకొలెస్ట్రాల్ తగ్గుటకు, క్యాన్సర్ నివారణకు ఉపయోగపడుతుంది.ఈ రైస్ను యాంటీ ఏజింగ్ రైస్ అని కూడా అంటారు.
3👉 కుళ్లాకార్: ఈ రైసు ఎరుపు రంగులో ఉంటుంది.గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది సాధారణ ప్రసవానికి తోడ్పడుతుంది మరియు పిల్లలకు జ్ఞాపకశక్తి ఎక్కువగా పెరుగుతుంది. ఈ రైస్లో మాంగనీసు,విటమిన్ బి6,కాల్షియం, ప్రోటీన్స్ ,కార్బోహైడ్రేట్స్ ,పొటాషియం ,ఫైబర్ అధికంగా ఉంటాయి. ప్రపంచములో అత్యంత ముఖ్యమైన మానవ ఆహార పంట బియ్యం.
4👉 పుంగార్: ఈ రైసు ఎరుపు రంగులో ఉంటుంది. అధిక పోషకాలు,ప్రోటీన్స్ కలిగి ఉంటుంది మరియు ఆకలిని కూడా ప్రేరేపిస్తుంది,శరీరానికి బలాన్ని ఇస్తుంది. గర్భాధారణ సమయంలో తీసుకుంటే సుఖ ప్రసవానికి తోడ్పడుతుంది.ఇది100% మహిళలకు మంచిది.
5👉 మైసూర్ మల్లిగా: ఈ రైసు తెలుపు రంగులో ఉంటుంది.ఎదిగే పిల్లలకు అవసరమైన అధిక పోషకాలు,ప్రోటీన్స్ లభించే గుణం కలిగి ఉంది. పిల్లలకు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.పిల్లలకు మోస్ట్ వ్యాల్యూబుల్ రైస్.
6👉 కుజిపాటలియా,సన్నజాజులు, చింతలూరు సన్నాలు,సిద్ధ సన్నాలు: ఇవి తెలుపు,సన్న రకాలు.ఈ బియ్యంలో కొవ్వు రహిత మరియు సోడియం లేనివి.తక్కువ కేలరీలు కలిగి వుంటాయి,గ్లూకోజ్ పదార్థంలు తక్కువగా ఉంటాయి,రోగనిరోధకశక్తి పెరగడానికి తోడ్పడతాయి.
7👉 రత్నచోడి:ఈ రైసు తెలుపు,సన్నరకం అధిక పోషక విలువలు ఉన్నాయి.కండపుష్టికి మరియు శరీర సమతుల్యతకు ఉపయోగపడుతుంది.శరీరానికి బలాన్ని చేకూరుస్తుంది.పూర్వకాలంలో సైనికులకు ఆహారంగా వాడే వారు.రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
8👉 బహురూపి,గురుమట్టియా,వెదురు సన్నాలు: తెలుపు,లావు రకం ఈ బియ్యంలో అధిక పోషకాలు,పీచు పదార్థంలు కలిగి ఉంటాయి.కాల్షియం,ఐరన్,జింకు ఎక్కువగా ఉంటాయి.మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి తోడ్పడుతాయి.బహురూపి శ్రీకృష్ణదేవరాయల వారు కూడా తినేవారు.రోగనిరోధక శక్తి పెరగడానికి సహాయపడుతాయి.
9👉 నారాయణ కామిని:ఈ రైసు తెలుపు, సన్న రకము .ఇందులో అధిక పోషకాలు, పీచుపదార్థాలు,కాల్షియం ఎక్కువగా ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు తగ్గడానికితోడ్పడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
10👉 ఘని: ఈ రైసు తెలుపు,చిన్న గింజ రకం. అధిక పోషకాలు కాల్షియం ఐరన్ ఎక్కువ. శరీరానికి బలాన్ని చేకూరుస్తుంది.వర్షా కాలమునకు ఇది అనువైన విత్తనం.చేను పై గాలికి పడిపోదు.రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
11👉 ఇంద్రాణి: ఈ రైసు తెలుపు,సన్నరకం, సెంటెడ్ రకము.కాల్షియం,ఐరన్,D విటమిన్ ఎక్కువగా ఉంటుంది.పిల్లలు బాగా ఇష్టపడి తింటారు.పెద్దవాళ్లు కూడా తినవచ్చు.గుల్ల భారిన(బోలు)ఎముకలు దృఢముగా మారడానికి సహాయపడుతుంది,జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
12👉 ఇల్లపు సాంబ: ఈ రైసు తెలుపు, సన్నరకం,ఇది మైగ్రేన్ సమస్యలను,సైనస్ సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది.శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
13👉 చిట్టి ముత్యాలు: ఈ రైసు తెలుపు,చిన్న గింజ రకం,కొంచెం సువాసన కలిగి ఉంటుంది. ప్రసాదంలకు,పులిహారమునకు,బిర్యానీలకు చాలా బాగుంటుంది. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
14👉దేశీ బాసుమతి: ఈ రైసు తెలుపు,పొడవు రకము,సువాసన కలిగి ఉంటుంది. ఇది బిర్యానీలకు అనుకూలంగా ఉంటుంది.
15👉 కాలాజీరా: ఈ రైస్ తెలుపు రంగులో ఉంటుంది.ఇది సువాసన కలిగిన బేబీ బాస్మతి రైస్.ఇది బిర్యానీలకు చాలా అనుకూలంగా ఉంటుంది.
16👉 పరిమళ సన్నము,రాంజీరా,రధునీ పాగల్,గంధసాలె,తులసీబాసో,బాస్ బోగ్, కామిని బొగ్: ఇవన్నీ తెలుపు రకము. సుగంధభరితమైన బియ్యం.ఇవి ప్రసాదంలకు, పులిహారములకు,పాయసములకు చాలా బాగుంటాయి.రోగనిరోధకశక్తిని పెంపొందిస్తాయి.
17👉 దూదేశ్వర్,అంబేమెహర్(scented వెరైటీ ): ఈ రైసు తెలుపు,బాలింతల స్త్రీలకు పాలు పెరగడానికి తోడ్పడుతాయి.తద్వారా పిల్లలకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది.తల్లి పిల్లలకు అధిక పోషకాలు అందుతాయి,తద్వారా ఆరోగ్యంగా ఉంటారు.
18👉 కుంకుమసాలి: ఈ రైసు తెలుపు,రక్త ప్రసరణ మెరుగుపరచడానికి, మలినాలను శుభ్రం చేయడానికి ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
19👉 చికిలాకోయిలా:ఈ రైసు తెలుపు,సన్న రకము, దీని వల్ల లాభం కిడ్నీలో రాళ్లు, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారు,డైలీ కిడ్నీ డయాలసిస్ వారికి చాలా ఉపయోగంగా ఉంటుంది.కిడ్నీకి సంబంధించిన సమస్యల నుండి ఇబ్బంది పడకుండా సహాయపడుతుంది.
20👉 మడమురంగి: ఈ రైసు ఎరుపు,లావు రకము.ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్,ఐరన్, జింక్,కాల్షియం ఉంటాయి.వర్షాకాలంలో అడుగు పైన ముంపును కూడ తట్టుకునే రకము. మంచి దిగుబడిని కూడా ఇస్తుంది.ఇది తీర ప్రాంతాల్లో ఎక్కువగా పండిస్తారు.
21👉 కెంపు సన్నాలు: ఈ రైసు ఎరుపు, సన్నరకం,ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, కార్బోహైడ్రేట్స్,కాల్షియం,జింక్,ఐరన్,అధిక పోషకాలు ఉంటాయి,రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
22👉 కాలాబట్టి,కాలాబట్,,బర్మా బ్లాక్,మణిపూర్ బ్లాక్: ఇవి నలుపు రంగులో ఉంటాయి.ఇవి అధిక యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ కలిగినవి. ఈ రైస్ వలన కలిగే లాభాలు,క్యాన్సర్ మరియు డయాబెటిస్, గుండె జబ్బుల వంటి అనారోగ్యాల బారిన నుండి రక్షణ కల్పిస్తుంది.ఎల్.డి.ఎల్ కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది.ఈ బియ్యంలో విటమిన్ బి,ఇ,నియాసిన్,కాల్షియం,మెగ్నీషియం,ఐరన్, జింకు వంటి ఖనిజ విలువలు,పీచు పదార్ధాలు అధికము.ఈ బియ్యంలో ఆంకోసైనిన్స్, యాంటీ ఆక్సిడెంట్లుగా పని చేయడమే గాక రోగనిరోధక ఎంజైములను క్రియాశీలకము చేస్తుంది. మోస్ట్ వ్యాల్యూబుల్ రైస్.
23👉 పంచరత్న: ఈ రైసు ఎరుపు రంగులో ఉంటుంది,ఇది వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ కలిగి ఉంటుంది.అమైనో ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి.ఇది కూడా వండర్పుల్ రైస్.
24👉 మా పిళ్లేసాంబ: ఈ రైసు ఎర్రగా ఉంటుంది.గర్భాధారణ సమస్యలతో బాధపడుతున్న దంపతులకు చాలా ఉపయోగం.రోజు ఇరువురు కనీసం 5నుండి6 నెలల వరకు తిన్నచో గర్భాధారణ జరుగును. ఇది ప్రాక్టికల్గా నిరూపించబడినది.దీనివలన కండ పుష్టి, దాతు పుష్టి ,వీర్య పుష్టి కలుగును. ఇమ్యూనిటీపవర్ కూడా పెరుగును.
25👉 నవార: ఈ రైసు ఎరుపు రంగులో ఉంటుంది. ఇది కేరళ సాంప్రదాయ ఆయుర్వేద ఔషధం.ఈ విత్తనం త్రేతాయుగము నాటిది. షుగర్ వ్యాధి గ్రస్తులకు షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి ఔషధంలా పనిచేస్తుంది. మరియు మోకాళ్ళు,మోచేతి కీళ్ళ నొప్పులు,నరాల బలహీనత తగ్గడానికి తోడ్పడుతుంది.కేరళ ఆయుర్వేదంలో ఈ బియ్యంను వండి బాడీ మసాజ్ లో వాడుతారు పక్షపాతం ఉన్నవారికి. ఈ రైస్ను ఇండియన్ వయాగ్రా రైస్ అని కూడా అంటారు.ఇది అన్ని వయసుల వారూ తినవచ్చును.ఒక పూట మాత్రమే తినవలెను. ఈ రైస్ యొక్క ప్రత్యేకత బియ్యం నుండి కూడా మొలకలు వచ్చును. ఇది వండర్ఫుల్ రైస్.
26👉 రాజముడి:ఈ రైస్ తెలుపు ఎరుపు కలిగి ఉంటుంది.దీనిని ప్రాచీన కాలంలో మైసూర్ మహారాజుల కోసం ప్రత్యేకముగా పండించిన బియ్యముల్లో ఇది ఒకటి.దీనికి ప్రత్యేకస్థానం ఉంది.ఈ రైస్లో డైటరీ ఫైబర్,యాంటీ ఆక్సిడెంట్స్ ,జింక్,ఐరన్ అధికంగా ఉంటాయి. అందువలన శరీరాన్ని ఇన్ఫెక్షన్లు మరియు ప్రీరాడికల్స్ నుండి నిరోధిస్తుంది.శరీరము అశ్వస్థత నుండి కోలుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. చర్మం యొక్క ఆకృతిని పెంచడానికి సహాయపడుతుంది.రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
గమనిక: దేశవాళీ విత్తనములు ఆన్నిరకాల్లో రోగనిరోధక శక్తి పెరగడానికి అవకాశం చాలా ఎక్కువ.హైబ్రిడ్ విత్తనాలులో రోగనిరోధక శక్తి ఉండదు.