Friday, September 16, 2016

తెల్ల జుట్టు ని ఆపేది ఎలా? పరిష్కారం...

తెల్ల జుట్టు ని ఆపేది ఎలా? 


చిన్న వయసులోనే జుట్టు నెరవడం అనేది చాలా సమస్యగా మారింది. ఇంట్లో ఉండే ఔషదాలను వాడటం వలన జుట్టు రంగు మారటాన్ని కొంత వరకు అయిన ఆపవచ్చు లేదా రంగు మారే సమయాన్ని పొడిగించవచ్చు. కొన్ని ఉసిరికాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించండి. ఈ ముక్కలను కొబ్బరి నూనెలో కలిపి నల్లగా మారే వరకు వేడిచేయండి. వచ్చిన మిశ్రమాన్ని మీ జుట్టుకు పూయండి.
 ఈ విధంగా ఇంట్లోనే మీ జుట్టు నెరవకుండా ఉంటుంది. కరివేపాకు కొబ్బరి నూనెలో వేసి అవి నల్ల రంగులోకి మారే వరకు వేడి చేయండి. ఈ మిశ్రమాన్ని మజ్జిగలో కలిపి మీ తలకు పూయండి ఇలా చేయటం వలన మీ తల వెంట్రుకలు తెల్లగా మారటాన్ని నివారిస్తుంది. జుట్టు రంగు మారటానికి ఒత్తిడి కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. అధిక ఒత్తిడి వలన జుట్టు బూడిద రంగులోకి మారుతుంది. జుట్టు రంగు మారకూడదు అనుకుంటే, ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఒత్తిడికి దూరంగా ఉండటం వలన మీ మానసిక స్థితి కూడా అదుపులో ఉంటుంది.

చిన్న చిన్న చిట్కాలతో ఈ తెల్ల జుట్టు సమస్యకు చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు నిపుణులు. ఇందులో మొదటిది.. ఓ చేతి గోళ్ళ వేళ్ళతో, మరో చేతి గోళ్ళను కనీసం 5 నిమిషాల పాటు రుద్దాలి. ప్రతి రోజూ 2-3 సార్లు ఇలా చేయాలి. ఇలా చేస్తే జుట్టు రాలడం ఆగిపోవడమే కాదు తెల్లబడమూ ఆగిపోతుంది. అంతే కాక అప్పటి నుండి.. జుట్టు ఒత్తుగా, నల్లగా మారడం మొదలు అవుతాయి.

ఈ ప్రయోగం వేల మంది పై ప్రయోగించగా వయసుతో పని లేకుండా  విజయవంతమైంది. అప్పటి నుంచి ఆయుర్వేద వైద్యంలో దీనిని భాగం చేశారు. ఇక ఈ క్రింది వాటిని అన్నీ.. బాగా కలిపెట్టి తలకు పట్టించి అరగంట తర్వాత నీటితో కడిగేయాలి. ఇలా నెల రోజులు క్రమం తప్పకుండా చేస్తే జుట్టు నల్లబడుతుందని మన ఆయ్వర్వేదం చెబుతుంది.
అవి ఏమిటంటే..:
ఉసిరి చూర్ణం- 10గ్రాములు
నిమ్మరసం- 4స్పూన్లు
కాఫీ పొడి- 3గ్రాములు
మెత్తగా రుబ్బిన గోరింటాకు- 100 గ్రాములు
పెరుగు-25గ్రాములు
బ్రహ్మి చూర్ణం- 10గ్రాములు
ఖదిరము (కటేచు) - 3గ్రాములు
అన్నింటిని బాగా కలిపి తలకి బాగా పట్టించి, ఒక 30 నిమిషాలు నీడలో ఆరబెట్టి,  నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వలన తెల్ల వెంట్రుకలు నల్లగా మారుతాయని మన ఆయుర్వేదం తెలియజేస్తుంది. 

కళ్ళజోడు - కంటి స‌మ‌స్య‌లు పోయి దృష్టి బాగా కనిపిస్తుంది.

ఈ మధ్య కాలంలో ప్రతి ముగ్గురిలో ఒకరికి ఖచ్చితంగా కళ్ళజోడు ఉంటుంది, రోజురోజుకి కళ్ళజోడు పెట్టుకునే వారి సంఖ్య పెరిగిపోతుంది, సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల చాలా మందికి కంటి చూపు మందగిస్తుంది, చాలామంది చిన్నప్పటి నుండే ఎక్కువ సైట్ కలిగిన కళ్ళద్దాలని వాడుతున్నారు, కంటిచూపు మనదగించడం వల్ల వేరే కంటి సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది, మన తాతల కాలంలో ఎలాంటి కళ్లజోడులు లేవు, వారు సరైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండేవారు, మనం మాత్రం ఏది పడితే అది తిని, విటమిన్లు లేని ఆహారాన్నే తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.  
కంటిచూపు కూడా విటమిన్ల లోపం వల్లనే వస్తుంది, చాలా మంది లేజర్ ఆపరేషన్లు చేయించుకొని కంటిచూపుని సరి చేసుకుంటున్నారు, ఆ ఆపరేషన్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, మన ఇంట్లోనే ఉండే పదార్థాలతోనే మనం మన కంటిచూపుని తిరిగి పొందవచ్చు.


  • పది పచ్చి ఉసిరి కాయ‌ల‌ను తీసుకుని బాగా క‌డిగి వాటిలోంచి విత్త‌నాల‌ను వేరు చేసి ఆ కాయ‌ల‌ను చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. ఆ ముక్క‌ల‌ను మిక్సీలో వేసి మిశ్ర‌మంగా చేశాక దాన్నుంచి జ్యూస్‌ను తీయాలి. ఈ జ్యూస్‌ను తేనెతో క‌లిపి నిత్యం ఉద‌యాన్నే తాగాలి. దీని వ‌ల్ల కంటి స‌మ‌స్య‌లు పోయి దృష్టి బాగా వ‌స్తుంది.
  • అర‌కిలో వాల్‌న‌ట్స్‌, 300 గ్రాముల తేనె, 100 గ్రాముల క‌ల‌బంద గుజ్జు లేదా జ్యూస్‌, 4 నిమ్మ‌కాయ‌ల‌ను తీసుకోవాలి. నిమ్మ‌కాయ‌ల‌ను పిండి వాటి నుంచి ర‌సం తీసి దాన్ని మిగిలిన ప‌దార్థాల‌కు బాగా క‌లిపి మిశ్ర‌మంగా చేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని రోజుకు 3 సార్లు తీసుకోవాలి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌, మ‌ధ్యాహ్నం లంచ్‌, రాత్రి డిన్న‌ర్‌కు ముందు ఈ మిశ్ర‌మాన్ని సేవిస్తుంటే క్ర‌మంగా కంటి చూపు మెరుగ‌వుతుంది. 6 నెల‌ల గ‌ర్భం దాటిన మ‌హిళ‌లు, కిడ్నీలు, గ్యాస్ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు దీన్ని తీసుకోకూడ‌దు.
  • 8 నుంచి 10 బాదం పప్పుల‌ను తీసుకుని రాత్రి పూట నీటిలో నాన‌బెట్టాలి. ఉద‌యం ఆ బాదంప‌ప్పు పొట్టును తీసివేయాలి. అనంత‌రం వాటిని మెత్త‌ని పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ పేస్ట్‌ను ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని వేడి పాల‌లో క‌లిపి ఉద‌యాన్నే తాగాలి. ఒక‌టి, రెండు నెల‌ల పాటు ఇలా తాగితే చూపు బాగా వ‌స్తుంది. కంటి స‌మ‌స్య‌లు పోతాయి.
  • విటమిన్ ఏ ఎక్కువగా ఉండే పాలకూర, క్యారెట్, బొప్పాయి, పాలని ఎక్కువగా తీసుకోవాలి.
కళ్ళల్లో మంటగా అనిపించినప్పుడు చల్లని నీటితో కడుక్కోవాలి, చుట్టూ చీకటి ఉన్నప్పుడు కళ్లపై ఎక్కువ ఒత్తిడి పడకుండా జాగ్రత్త పడాలి.

Friday, September 2, 2016