Friday, September 16, 2016

తెల్ల జుట్టు ని ఆపేది ఎలా? పరిష్కారం...

తెల్ల జుట్టు ని ఆపేది ఎలా? 


చిన్న వయసులోనే జుట్టు నెరవడం అనేది చాలా సమస్యగా మారింది. ఇంట్లో ఉండే ఔషదాలను వాడటం వలన జుట్టు రంగు మారటాన్ని కొంత వరకు అయిన ఆపవచ్చు లేదా రంగు మారే సమయాన్ని పొడిగించవచ్చు. కొన్ని ఉసిరికాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించండి. ఈ ముక్కలను కొబ్బరి నూనెలో కలిపి నల్లగా మారే వరకు వేడిచేయండి. వచ్చిన మిశ్రమాన్ని మీ జుట్టుకు పూయండి.
 ఈ విధంగా ఇంట్లోనే మీ జుట్టు నెరవకుండా ఉంటుంది. కరివేపాకు కొబ్బరి నూనెలో వేసి అవి నల్ల రంగులోకి మారే వరకు వేడి చేయండి. ఈ మిశ్రమాన్ని మజ్జిగలో కలిపి మీ తలకు పూయండి ఇలా చేయటం వలన మీ తల వెంట్రుకలు తెల్లగా మారటాన్ని నివారిస్తుంది. జుట్టు రంగు మారటానికి ఒత్తిడి కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. అధిక ఒత్తిడి వలన జుట్టు బూడిద రంగులోకి మారుతుంది. జుట్టు రంగు మారకూడదు అనుకుంటే, ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఒత్తిడికి దూరంగా ఉండటం వలన మీ మానసిక స్థితి కూడా అదుపులో ఉంటుంది.

చిన్న చిన్న చిట్కాలతో ఈ తెల్ల జుట్టు సమస్యకు చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు నిపుణులు. ఇందులో మొదటిది.. ఓ చేతి గోళ్ళ వేళ్ళతో, మరో చేతి గోళ్ళను కనీసం 5 నిమిషాల పాటు రుద్దాలి. ప్రతి రోజూ 2-3 సార్లు ఇలా చేయాలి. ఇలా చేస్తే జుట్టు రాలడం ఆగిపోవడమే కాదు తెల్లబడమూ ఆగిపోతుంది. అంతే కాక అప్పటి నుండి.. జుట్టు ఒత్తుగా, నల్లగా మారడం మొదలు అవుతాయి.

ఈ ప్రయోగం వేల మంది పై ప్రయోగించగా వయసుతో పని లేకుండా  విజయవంతమైంది. అప్పటి నుంచి ఆయుర్వేద వైద్యంలో దీనిని భాగం చేశారు. ఇక ఈ క్రింది వాటిని అన్నీ.. బాగా కలిపెట్టి తలకు పట్టించి అరగంట తర్వాత నీటితో కడిగేయాలి. ఇలా నెల రోజులు క్రమం తప్పకుండా చేస్తే జుట్టు నల్లబడుతుందని మన ఆయ్వర్వేదం చెబుతుంది.
అవి ఏమిటంటే..:
ఉసిరి చూర్ణం- 10గ్రాములు
నిమ్మరసం- 4స్పూన్లు
కాఫీ పొడి- 3గ్రాములు
మెత్తగా రుబ్బిన గోరింటాకు- 100 గ్రాములు
పెరుగు-25గ్రాములు
బ్రహ్మి చూర్ణం- 10గ్రాములు
ఖదిరము (కటేచు) - 3గ్రాములు
అన్నింటిని బాగా కలిపి తలకి బాగా పట్టించి, ఒక 30 నిమిషాలు నీడలో ఆరబెట్టి,  నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వలన తెల్ల వెంట్రుకలు నల్లగా మారుతాయని మన ఆయుర్వేదం తెలియజేస్తుంది. 

No comments:

Post a Comment