Tuesday, December 27, 2016

కీళ్లు, మోకాళ్ల మధ్య అరిగిపోయిన జిగురులాంటి పదార్థం తిరిగి పెరుగుతుంది.. ఎలా???

1)                        
                                     రోజురోజుకి మారిపోతున్న ఈ కాలంలో లేచినప్పటి నుండి వివిధ రకాల ఒత్తిడిలతో సతమతమవుతూ ఎప్పుడు తింటామో, ఎప్పుడు నిద్రపోతామో కూడా సరిగా తెలియదు, దానితో వివిధ రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముట్టేస్తాయి, ఈ కాలంలో ఎక్కువమంది సరియైన ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల శరీరంలో చాలా మార్పులు వస్తున్నాయి, ముఖ్యంగా ఎముకలు బలహీనంగా అవుతున్నాయి, అందువల్ల నడుం నొప్పి, కీళ్ల నొప్పులతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, మన ఎముకలు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏ పని అయిన చేయగలుగుతాం.
మన శరీరంలో ఎముకలలో కాల్షియం తగ్గిపోయి బలహీనంగా అయ్యాయి అని తెలిస్తే వెంటనే మెడికల్ షాప్ కి వెళ్లి కెమికల్స్ తో కూడిన కాల్షియం ట్యాబ్లేట్ ని వేసుకుంటాం వాటివల్ల వేరే రోగాలు వచ్చే అవకాశం కూడా ఉంది, కానీ పూర్వ కాలంలో ఎముకలని బలంగా చేయడానికి కెమికల్స్ తో కూడిన ట్యాబ్లేట్స్ అంటూ ఏమి లేవు, సహజంగా దొరికే పదార్థాలతోనే వారు ఎముకలని బలంగా చేసుకునేవారు, అందుకే వారు చాలా బలంగా ఉండి ఎక్కువకాలం ఆరోగ్యంగా బతికేవారు, వారు అప్పుడు ఉపయోగించిన పద్ధతినే ఇప్పుడు ఆయుర్వేద వైద్యంలో కూడా వాడుతున్నారు, ఈ పదార్థాన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.


కావాల్సిన పదార్థాలు:
  • 50 గ్రాముల గోధుమరవ్వ
  • 50 గ్రాముల పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాలు(Sun flower seeds)
  • 3 టేబుల్ స్పూన్ల ఎండు ద్రాక్ష
  • 3 టేబుల్ స్పూన్ల నువ్వులు
  • 50 గ్రాముల గుమ్మడికాయ గింజలు
  • 1 టేబుల్ స్పూన్ల అవిసె గింజలు
  • ఒక కిలో తేనె

తయారు చేయు విధానం:

ముందుగా స్వచ్ఛమైన తేనెని తీసుకోని ఒక పెద్ద గిన్నెలో పోయాలి, దానిలో నువ్వులు, అవిసె గింజలు, ఎండు ద్రాక్షలని వేసి బాగా కలపాలి, ఆ తరువాత గోధుమ రవ్వని, పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలని వేసి బాగా కలపాలి, బాగా కలపగా వచ్చిన మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో భద్రపరచాలి.
ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ కు ముందు ఒక టీస్పూన్ మిశ్రమాన్ని తీసుకుంటే సరిపోతుంది. ఈ మిశ్రమాన్ని తీసుకోవటం వల్ల కాల్షియం పెరిగి ఎముకలు గట్టిపడతాయి. దీంతోపాటు కీళ్లు, మోకాళ్ల మధ్య అరిగిపోయిన జిగురులాంటి పదార్థం తిరిగి పెరుగుతుంది. మజిల్, జాయింట్ పెయిన్స్ ను తగ్గిస్తుంది.

____________________________________________________________________________________

2)
                                                       మనవ శరీరంలో ప్రతి భాగం ఎముకతో ముడిపడి ఉంటుంది. ఇది అందరికి తెలిసిన విషయం. ఒక మనిషి తన ఎదుగుదలలో 30 సంవత్సరాల వరకు ఎముకల ఎదుగుదల ఉంటుంది. ఆ తరువాత ఎముక పెరగటం ఆగిపోతుంది. మన శరీరంలో పాత ఎముకలు పాడైన కొద్ది కొత్త ఎముకలు వస్తుంటాయి. అలాగే వయస్సు పెరుగుతున్న కొద్దీ, ఎముకలు చాలా బలహీనపడుతుంటాయి. అందులో ఆడవారికి ఎక్కువగా ఈ సమస్య జరుగుతుంటుంది. సరైన ఆహారపు అలవాట్లు లేకపోయినా ఎముకలు దెబ్బతింటాయి. ఎప్పుడైతే ఎముకలు బలహీన పడటం ప్రారంభిస్తాయో అప్పటి నుంచి ఇక ఏ పని చేయలేరు. అందుకే తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. లేదంటే మాత్రం చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. వీటన్నింటికీ పరిష్కారంగా వైద్య నిపుణులు ఎముకల బలాన్ని పెంచుకొనేందుకు ఒక పద్దతిని మనకు ఒక డ్రింక్ పద్దతిలో తెలియజేస్తున్నారు. ఈ డ్రింక్ ని వరుసగా 15 రోజులపాటు తీసుకొంటే ఎముకలు ఉక్కు లాగా గట్టిపడతాయని చెపుతున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

డ్రింక్ తయారీకి కావలసినవి:
  • తేనె 2 టేబుల్ స్పూన్లు
  • నువ్వులు 1 టేబుల్ స్పూన్
  • గుమ్మడి విత్తనాలు అర టేబుల్ స్పూన్
ఇలా చేయాలి:
తేనె, నువ్వులు, గుమ్మడి విత్తనాలను సరైన మొతాదులో తీసికొని గ్రైండ్ చేసుకోవాలి.ఓ కప్పు వేడిపాలలో ఈ మిశ్రమాన్ని కలపాలి. ప్రతి రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత ఈ మిశ్రమాన్ని తాగాలి.
ఈ మిశ్రమంలో కాల్షియం అధికంగా ఉంటుంది. విటమిన్ డి, ఇతర మినరల్స్ అధికంగా శరీరానికి అందుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో ఇన్ ఫెక్షన్లు, ఇతర సమస్యలు రాకుండా ఉంటాయి.ఒక్క సారి మీరు ఈ పద్దతిలో తయారు అయిన డ్రింక్ ని తాగి చూడండి మీ ఆరోగ్యాన్ని మీ చేతుల్లో ఉంచుకోండి.


Friday, September 16, 2016

తెల్ల జుట్టు ని ఆపేది ఎలా? పరిష్కారం...

తెల్ల జుట్టు ని ఆపేది ఎలా? 


చిన్న వయసులోనే జుట్టు నెరవడం అనేది చాలా సమస్యగా మారింది. ఇంట్లో ఉండే ఔషదాలను వాడటం వలన జుట్టు రంగు మారటాన్ని కొంత వరకు అయిన ఆపవచ్చు లేదా రంగు మారే సమయాన్ని పొడిగించవచ్చు. కొన్ని ఉసిరికాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించండి. ఈ ముక్కలను కొబ్బరి నూనెలో కలిపి నల్లగా మారే వరకు వేడిచేయండి. వచ్చిన మిశ్రమాన్ని మీ జుట్టుకు పూయండి.
 ఈ విధంగా ఇంట్లోనే మీ జుట్టు నెరవకుండా ఉంటుంది. కరివేపాకు కొబ్బరి నూనెలో వేసి అవి నల్ల రంగులోకి మారే వరకు వేడి చేయండి. ఈ మిశ్రమాన్ని మజ్జిగలో కలిపి మీ తలకు పూయండి ఇలా చేయటం వలన మీ తల వెంట్రుకలు తెల్లగా మారటాన్ని నివారిస్తుంది. జుట్టు రంగు మారటానికి ఒత్తిడి కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. అధిక ఒత్తిడి వలన జుట్టు బూడిద రంగులోకి మారుతుంది. జుట్టు రంగు మారకూడదు అనుకుంటే, ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఒత్తిడికి దూరంగా ఉండటం వలన మీ మానసిక స్థితి కూడా అదుపులో ఉంటుంది.

చిన్న చిన్న చిట్కాలతో ఈ తెల్ల జుట్టు సమస్యకు చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు నిపుణులు. ఇందులో మొదటిది.. ఓ చేతి గోళ్ళ వేళ్ళతో, మరో చేతి గోళ్ళను కనీసం 5 నిమిషాల పాటు రుద్దాలి. ప్రతి రోజూ 2-3 సార్లు ఇలా చేయాలి. ఇలా చేస్తే జుట్టు రాలడం ఆగిపోవడమే కాదు తెల్లబడమూ ఆగిపోతుంది. అంతే కాక అప్పటి నుండి.. జుట్టు ఒత్తుగా, నల్లగా మారడం మొదలు అవుతాయి.

ఈ ప్రయోగం వేల మంది పై ప్రయోగించగా వయసుతో పని లేకుండా  విజయవంతమైంది. అప్పటి నుంచి ఆయుర్వేద వైద్యంలో దీనిని భాగం చేశారు. ఇక ఈ క్రింది వాటిని అన్నీ.. బాగా కలిపెట్టి తలకు పట్టించి అరగంట తర్వాత నీటితో కడిగేయాలి. ఇలా నెల రోజులు క్రమం తప్పకుండా చేస్తే జుట్టు నల్లబడుతుందని మన ఆయ్వర్వేదం చెబుతుంది.
అవి ఏమిటంటే..:
ఉసిరి చూర్ణం- 10గ్రాములు
నిమ్మరసం- 4స్పూన్లు
కాఫీ పొడి- 3గ్రాములు
మెత్తగా రుబ్బిన గోరింటాకు- 100 గ్రాములు
పెరుగు-25గ్రాములు
బ్రహ్మి చూర్ణం- 10గ్రాములు
ఖదిరము (కటేచు) - 3గ్రాములు
అన్నింటిని బాగా కలిపి తలకి బాగా పట్టించి, ఒక 30 నిమిషాలు నీడలో ఆరబెట్టి,  నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వలన తెల్ల వెంట్రుకలు నల్లగా మారుతాయని మన ఆయుర్వేదం తెలియజేస్తుంది. 

కళ్ళజోడు - కంటి స‌మ‌స్య‌లు పోయి దృష్టి బాగా కనిపిస్తుంది.

ఈ మధ్య కాలంలో ప్రతి ముగ్గురిలో ఒకరికి ఖచ్చితంగా కళ్ళజోడు ఉంటుంది, రోజురోజుకి కళ్ళజోడు పెట్టుకునే వారి సంఖ్య పెరిగిపోతుంది, సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల చాలా మందికి కంటి చూపు మందగిస్తుంది, చాలామంది చిన్నప్పటి నుండే ఎక్కువ సైట్ కలిగిన కళ్ళద్దాలని వాడుతున్నారు, కంటిచూపు మనదగించడం వల్ల వేరే కంటి సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది, మన తాతల కాలంలో ఎలాంటి కళ్లజోడులు లేవు, వారు సరైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండేవారు, మనం మాత్రం ఏది పడితే అది తిని, విటమిన్లు లేని ఆహారాన్నే తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.  
కంటిచూపు కూడా విటమిన్ల లోపం వల్లనే వస్తుంది, చాలా మంది లేజర్ ఆపరేషన్లు చేయించుకొని కంటిచూపుని సరి చేసుకుంటున్నారు, ఆ ఆపరేషన్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, మన ఇంట్లోనే ఉండే పదార్థాలతోనే మనం మన కంటిచూపుని తిరిగి పొందవచ్చు.


  • పది పచ్చి ఉసిరి కాయ‌ల‌ను తీసుకుని బాగా క‌డిగి వాటిలోంచి విత్త‌నాల‌ను వేరు చేసి ఆ కాయ‌ల‌ను చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. ఆ ముక్క‌ల‌ను మిక్సీలో వేసి మిశ్ర‌మంగా చేశాక దాన్నుంచి జ్యూస్‌ను తీయాలి. ఈ జ్యూస్‌ను తేనెతో క‌లిపి నిత్యం ఉద‌యాన్నే తాగాలి. దీని వ‌ల్ల కంటి స‌మ‌స్య‌లు పోయి దృష్టి బాగా వ‌స్తుంది.
  • అర‌కిలో వాల్‌న‌ట్స్‌, 300 గ్రాముల తేనె, 100 గ్రాముల క‌ల‌బంద గుజ్జు లేదా జ్యూస్‌, 4 నిమ్మ‌కాయ‌ల‌ను తీసుకోవాలి. నిమ్మ‌కాయ‌ల‌ను పిండి వాటి నుంచి ర‌సం తీసి దాన్ని మిగిలిన ప‌దార్థాల‌కు బాగా క‌లిపి మిశ్ర‌మంగా చేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని రోజుకు 3 సార్లు తీసుకోవాలి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌, మ‌ధ్యాహ్నం లంచ్‌, రాత్రి డిన్న‌ర్‌కు ముందు ఈ మిశ్ర‌మాన్ని సేవిస్తుంటే క్ర‌మంగా కంటి చూపు మెరుగ‌వుతుంది. 6 నెల‌ల గ‌ర్భం దాటిన మ‌హిళ‌లు, కిడ్నీలు, గ్యాస్ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు దీన్ని తీసుకోకూడ‌దు.
  • 8 నుంచి 10 బాదం పప్పుల‌ను తీసుకుని రాత్రి పూట నీటిలో నాన‌బెట్టాలి. ఉద‌యం ఆ బాదంప‌ప్పు పొట్టును తీసివేయాలి. అనంత‌రం వాటిని మెత్త‌ని పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ పేస్ట్‌ను ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని వేడి పాల‌లో క‌లిపి ఉద‌యాన్నే తాగాలి. ఒక‌టి, రెండు నెల‌ల పాటు ఇలా తాగితే చూపు బాగా వ‌స్తుంది. కంటి స‌మ‌స్య‌లు పోతాయి.
  • విటమిన్ ఏ ఎక్కువగా ఉండే పాలకూర, క్యారెట్, బొప్పాయి, పాలని ఎక్కువగా తీసుకోవాలి.
కళ్ళల్లో మంటగా అనిపించినప్పుడు చల్లని నీటితో కడుక్కోవాలి, చుట్టూ చీకటి ఉన్నప్పుడు కళ్లపై ఎక్కువ ఒత్తిడి పడకుండా జాగ్రత్త పడాలి.

Friday, September 2, 2016

Thursday, April 7, 2016

Dangerous and Poisonous Snake





       This is one of the most dangerous snakes. But it looks very small, little  and cute but it is Dangerous  and Poisonous venomous Snake .

Wednesday, March 30, 2016

షుగర్ వ్యాధిని ముందుగానే పసిగట్టండి - ఈ మహమ్మారి కి దూరముగా ఉండడం ఎలా ?!!!



షుగర్ వ్యాధిని ముందుగానే పసిగట్టవచ్చు ,
 వీటిలో ఏ లక్షణాలైనా మీలో ఉంటే ఓ సారి డాక్టర్ని సంప్రదించగలరు.

నేటి ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన అనారోగ్య సమస్య తలెత్తుతూనే ఉంది. అయితే వీటిని సూచిస్తూ మన శరీరం ముందుగానే కొన్ని అనారోగ్య లక్షణాలను మనకు తెలుపుతుంది. కానీ మనలో అధిక శాతం మంది ఈ అనారోగ్య లక్షణాలు, సూచనలను పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. దీంతో సమస్య వచ్చినప్పుడు బాధపడాల్సి వస్తోంది. అయితే శరీరం ఎప్పటికప్పుడు తెలియజేసే అనారోగ్య హెచ్చరికలను ముందుగానే పసిగడితే దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ముందుగానే జాగ్రత్త పడేందుకు అవకాశం ఉంటుంది.అలాంటి వాటిలో డయాబెటిస్ కూడా మొదటిదిగా చెప్పుకొవచ్చు. 






రక్తంలో చక్కెరలు ఎక్కువగా పేరుకోవడం వల్ల, ఇన్సులిన్ సరిగ్గా ఉత్పత్తి కాక, ఒకవేళ ఉత్పత్తి అయినా శరీరం దాన్ని ఉపయోగించుకోలేకపోవడం వల్ల, నిత్యం శరీరానికి తగినంత వ్యాయామం లేకపోవడం వల్ల కూడా షుగర్ వ్యాధి వస్తుంది. ఇది వచ్చే క్రమంలో మనకు ముందుగానే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీని వల్ల ఎంతో కొంత జాగ్రత్త పడేందుకు అవకాశం ఉంటుంది.
1. షుగర్ వ్యాధి ఉంటే నోరు ఎల్లప్పుడూ పొడిగా ఉంటుంది. దీంతోపాటు దాహం ఎక్కువగా వేస్తుంది. మూత్రానికి ఎక్కువ సార్లు వెళ్తారు. సాధారణంగా రాత్రి పూట ఈ లక్షణాలను జాగ్రత్తగా పరిశీలించవచ్చు.

2. సాధారణంగా నిత్యం శారీరక శ్రమ, వ్యాయామం చేసే వారు, పనిచేసే వారు అలసిపోతుంటారు. అలా కాకుండానే మామూలుగానే అలసిపోయినట్టుగా ఉంటే వారు తమ రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగాయని అర్థం చేసుకోవాలి.
3. ఎల్లప్పుడూ శక్తి లేనట్టుగా, నీరసంగా, నిస్సత్తువగా ఉంటే వెంటనే షుగర్ స్థాయిలను చెక్ చేయించుకోవాలి. అవసరమైతే వైద్యున్ని సంప్రదించాలి. ఎక్కువగా ఆకలి వేస్తున్నా, చర్మంపై దురదలు వస్తున్నా, బరువు పెరుగుతున్నా రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని తెలుసుకోవాలి.
4. షుగర్ ఉంటే జీర్ణక్రియ కూడా మెరుగ్గా పనిచేయదు. దీంతోపాటు గాయాలు, పుండ్లు, దెబ్బల వంటివి త్వరగా మానవు.
5. ఏకాగ్రత కోల్పోవడం, నరాల బలహీనత, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి లక్షణాలు కూడా హై బ్లడ్ షుగర్‌ను సూచిస్తాయి.
6. షుగర్ వ్యాధి ఉంటే గ్లయిసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది. వీటి వల్ల శరీరంలోకి అదనపు క్యాలరీలు చేరకుండా ఉంటాయి.

7. పైన పేర్కొన్న లక్షణాలు ఉంటే వెంటనే ఆహార సంబంధ జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రధానంగా సరైన పోషకాలతో కూడిన పౌష్టికాహారాన్ని నిత్యం తీసుకోవాలి. దీంతోపాటు జంక్ ఫుడ్‌కు ఫుల్‌స్టాప్ పెట్టాలి. 
Source – గూగుల్ , ఫేస్ బుక్ 

Tuesday, March 29, 2016

అందమైన గాజు కూజ ని తయారు చేయడం ఎలా ?

అందమైన గాజు కూజ ని తయారు చేయడం ఎలా ?

అందమైన గాజు మగ్గు లేదా కూజ ని తయారి అంటే అంట సులభం  కాదు కదా !!!  ఈ వీడియో ని చూసి మీ అబిప్రాయాన్ని తెలియజేయండి ....