Wednesday, February 15, 2017

యూరిన్ కి వెళ్లకుండా ఎక్కువసేపు ఆపుకుంటే ఏమవుతుందో తెలుసా?!

యూరిన్ కి వెళ్లకుండా ఎక్కువసేపు ఆపుకుంటే ఏమవుతుందో తెలుసా?!


                                                యూరిన్ చాలా అర్జెంట్ అయినా అలాగే ఆపుకుంటూ ఉంటారు. జర్నీల్లోనో, చుట్టు పక్కన సరైన బాత్ రూం సౌకర్యం లేనప్పుడు, తాము వర్క్ చేస్తున్న దగ్గర పరిశుభ్రమైన బాత్ రూంలు లేనప్పుడు ఇలా.. యూరిన్ కి వెళ్లకుండా ఆపుకునే ప్రయత్నం చేస్తారు. ఇలా చేయడం వల్ల అనేక ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. అనవసరమైన, అవాంఛిత ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే.. యూరిన్ కి వెళ్లాలనే సంకేతం వచ్చినప్పుడు వెంటనే వెళ్లాలి. వెళ్లకుండా అలాగే బిగపట్టుకుంటే ఏమవుతుంది? ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయో చూద్దాం..
  1.  యూరిన్ ప్రతిసారీ ఆపుకోవడం వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. యూరినరీ ట్రాక్ లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తాయి.
  2. యూరిన్ లో క్రిములు ఎక్కువగా ఉంటాయి. అవి బ్లాడర్ లో ఎక్కువ సమయం ఉంటే.. తర్వాత ఇన్ఫెక్షన్ కి కారణమవుతాయి. కాబట్టి యూరిన్ సంకేతం వచ్చిన వెంటనే వెళ్లాలి.
  3. ఎక్కువసేపు యూరిన్ కి వెళ్లకుండా ఆపుకుంటూ ఉంటే కిడ్నీల్లో స్టోన్స్ ఏర్పడతాయి. చిన్న చిన్న కిడ్నీ స్టోన్స్ యూరిన్ ద్వారా బయటకు వెళ్లిపోతాయి. కానీ యూరిన్ కి వెళ్లకుండా ఆపుకుంటే రాళ్లు పెద్దగా అవుతాయి.
  4. కిడ్నీల్లో స్టోన్స్ ఏర్పడకుండా ఉండాలంటే ఎక్కువ మోతాదులో నీళ్లు తాగాలి. మీ శరీరం సూచించినప్పుడు యూరిన్ కి వెళ్లాలి. దీనివల్ల కిడ్నీల్లో ఉన్న ఎలాంటి వ్యర్థాలనైనా తొలగించుకోవచ్చు.
  5. యూరిన్ ఆపుకుంటే బ్లాడర్ లోని గోడల్లో వాపు వస్తుంది. ఇలా వాపు రావడాన్ని సిస్ట్స్ అంటారు. ఒకవేళ మీకు యూరిన్ పాస్ చేసేటప్పుడు పెల్విక్ పెయిన్ రావడం, తక్కువ మోతాదులో యూరిన్ రావడం వంటి లక్షణాలన్నీ సిస్ట్స్ ని సూచిస్తాయి. కాబట్టి ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డాక్టర్ ని సంప్రదించాలి.
  6. బ్లాడర్ లో యూరిన్ నిల్వ ఉంచుకోవడానికి లిమిట్ ఉంటుంది. బ్లాడర్ కేవలం 3 కప్పుల నీటిని మాత్రమే నిల్వ ఉంచుకోగలదు. కాబట్టి యూరిన్ కి వెళ్లడానికి అందుబాటులో బాత్ రూం లేనప్పుడు ఎక్కువ నీళ్లు తాగితే సమస్య వస్తుంది. కాబట్టి ముఖ్యమైన పని ఉన్నప్పుడు ఈ విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి.
  7. చాలా సమయం అలాగే బిగపట్టి ఉంటే బ్లాడర్ లో నిల్వ ఉండే యూరిన్ మళ్లీ మూత్రాశయంలోకి, కిడ్నీల్లోకి వెనక్కి వెళ్తుంది. దీనివల్ల చాలా తీవ్రమైన ఇన్ఫెక్షన్స్ వస్తాయి.
  8. యూరిన్ కి వెళ్లాలని శరీరం సంకేతం పంపినప్పుడు మీరు యూరిన్ కి వెళ్లకపోతే చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఈ లిక్విడ్స్ ని నిల్వ ఉంచుకోవడానికి శరీరం స్ట్రెచ్ అవుతుంది. దీనివల్ల పొట్టలో వాపు, ఇన్ఫెక్షన్ వస్తాయి
.

No comments:

Post a Comment